Home News 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo Y02A

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo Y02A

Highlights
  • బంగ్లాదేశ్ లో లాంచైన Vivo Y02A స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ పై పని చేయనున్న Vivo Y02A
  • ప్రస్తుతం భారతదేశంలో ఉన్న Vivo Y02 ని పోలి ఉన్న Vivo Y02A స్పెసిఫికేషన్స్

Vivo Y02A స్మార్ట్ ఫోన్ బంగ్లాదేశ్ లో లాంచ్ అయ్యింది. Vivo Y02 డివైజ్
గతేడాది భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఇదే ఫోన్ ని బంగ్లాదేశ్ లో Vivo Y02A పేరుతో లాంచ్ చేసింది. ఈ చవకైన ఫోన్ 3జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. సరే, ఓసారి Vivo Y02A స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y02A ధర

Vivo Y02A స్మార్ట్ ఫోన్ కేవలం సింగిల్ వేరియంట్ లో బంగ్లాదేశ్ లో లాంచ్ అయ్యింది. 32జిబి స్టోరేజీ, 3జిబి ర్యామ్ తో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర బీడీటీ 12,499 (సుమారు రూ.9,600) గా ఉంది. ఆర్కిడ్ బ్లూ మరియు కాస్మిక్ గ్రే కలర్ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బంగ్లాదేశ్ లో మాత్రమే సేల్ కి అందుబాటులో ఉంది.

Vivo Y02A స్పెసిఫికేషన్స్

Vivo Y02A స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది. ఈ ఫోన్ కి మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉంటాయి.

Vivo Y02A స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ బంగ్లాదేశ్ లో 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ గో ఓఎస్ వల్లన, గూగుల్ గో యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి తక్కువ ర్యామ్ ని వాడుకుని పని చేస్తాయి.

Vivo Y02A లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 163.99 మిల్లీ మీటర్ల పొడవు, 75.63 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.