Home News భారత్‌లో లాంచ్ కానున్న మరొక చవకైన ఫోన్‌ Vivo Y02t; BIS వెబ్‌సైట్ లో కనిపించిన డివైజ్

భారత్‌లో లాంచ్ కానున్న మరొక చవకైన ఫోన్‌ Vivo Y02t; BIS వెబ్‌సైట్ లో కనిపించిన డివైజ్

Highlights
  • మీడియాటెక్ హీలియో చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఫోన్
  • Vivo Y02t లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో ఒక చవకైన ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Vivo Y02t పేరుతో వస్తోన్న ఈ డివైజ్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్స్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో అతి త్వరలో భారత్ లో Vivo Y02t స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. మరి, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Vivo Y02t గురించి తెలిసిన వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y02t బీఐఎస్ లిస్టింగ్

Vivo Y02t స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

లీక్స్ ప్రకారం, Vivo Y02t స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంటుంది.

ర్యామ్, చిప్సెట్

Vivo Y02t లో మీడియాటెక్ హీలియో చిప్సెట్ ఉండనుంది. చిప్సెట్ కోడ్ నేమ్ ఇంకా రివీల్ కాలేదు. కానీ, హీలియో చిప్సెట్ ని బట్టి, ఇది 4జీ హ్యాండ్సెట్ అని అర్థమవుతోంది. ఈ ఫోన్ 2జిబి/4జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా విభాగం

Vivo Y02t స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి మెయన్ కెమెరా ఉంటుంది. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 6ఎంపి కెమెరా ఉంటుంది.

బ్యాటరీ

Vivo Y02t స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫోన్ యొక్క ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియలేదు.

Vivo Y02 ధర మరియు స్పెసిఫికేషన్స్

Vivo Y02 స్మార్ట్ ఫోన్ 2.5డి యూనీబాడీ డిజైన్ తో వచ్చింది. ఈఫోన్ లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ వాడారు. ఈ ఫోన్ 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఈ హ్యాండ్సెట్ Vivo Y02 గో ఎడిషన్ పై పని చేస్తుంది. ఫన్‌టచ్ 12 కస్టమ్ స్కిన్ ఈ ఫోన్ లో ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ చిప్సెట్ పై ఫోన్ పని చేస్తుంది.