Home News Vivo: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y03

Vivo: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y03

Highlights
  • Vivo Y03 గ్లోబల్ లాంచ్
  • హీలియో జీ85 చిప్సెట్
  • 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo ఒక కొత్త వై-సిరీస్ డివైజ్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. Vivo Y03 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో యూజర్లకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ54 రేటింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో లభిస్తున్నాయి. సరే, ఓసారి Vivo Y03 ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y03 ధర

Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y03 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 12,99,000 (సుమారు రూ.6,900) గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 14,99,000 (సుమారు రూ.8,000) గా ఉంది. Vivo Y03 స్మార్ట్‌ఫోన్ జెమ్ గ్రీన్ మరియు స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y03 స్పెసిఫికేషన్స్