
Vivo Y100 5G ఈరోజు చైనాలో లాంచ్ చేయబడింది. Vivo Y100 5G ఇండియా వేరియంట్‌తో పోలిస్తే కొత్తగా లాంచైన Vivo Y100 5G విభిన్న డిజైన్ మరియు చిప్‌సెట్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ Qualcomm యొక్క ఆక్టా-కోర్ చిప్సెట్ తో వచ్చింది. ఇది డ్యూయల్-కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మరియు భద్రతా ప్రయోజనాల కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. Vivo Y100 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo Y100 5G ధర, లభ్యత
Vivo Y100 5G స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్, గ్లాస్ బ్లూ, స్టారీ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y100 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1399 (రూ.15,900), 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1399 (సుమారు రూ.15,200), 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 1799 (సుమారు రూ.20,500), CNY 1999 (సుమారు రూ.22,800) గా ఉన్నాయి.
Vivo Y100 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo Y100 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.3 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y100 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వినియోగించారు.
మెమొరీ: Vivo Y100 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Vivo Y100 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Vivo Y100 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
చుట్టుకొలత, బరువు: Vivo Y100 5G డివైజ్ 164.42 మి.మీ పొడవు, 74.92 మి.మీ వెడల్పు, 7.57 మి.మీ మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.
కనెక్టివిటీ: Vivo Y100 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, జీపీఎస్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











