Home News లాంచ్ కి ముందు లీకైన Vivo Y100 5G లైవ్ ఇమేజ్

లాంచ్ కి ముందు లీకైన Vivo Y100 5G లైవ్ ఇమేజ్

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y100 5G స్మార్ట్ ఫోన్
  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, ఫిబ్రవరి 16 నుంచి మొదుల కానున్న Vivo Y100 5G డివైజ్ సేల్స్
  • భారత్ లో Vivo Y100 5G ధర రూ.27,000 నుంచి రూ.29,000 మధ్య ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y100 5G డివైజ్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది. దీంతో కొన్ని రోజులుగా సదరు సంస్థ వరుసబెట్టి Vivo Y100 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo Y100 5G ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 16 నుంచి భారత్ లో మొదలవుతాయని చెబుతూ, డివైజ్ లైవ్ ఇమేజెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

లైవ్ ఇమేజెస్ బయటకు రావడంతో Vivo Y100 5G డివైజ్ యొక్క డిజైన్, తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, Vivo Y100 5G డివైజ్ ఈ వారంలో లాంచ్ అవుతుంది. అలాగే ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 16 నుంచి మొదలవుతాయి.

Vivo Y100 5G లైవ్ ఇమేజ్

లైవ్ ఇమేజ్ విషయానికి వస్తే, Vivo Y100 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ ఎలా ఉందో తెలుస్తోంది. వివో ఇంకా ఫ్రంట్ లుక్ షేర్ చేయలేదు. అయితే మేం షేర్ చేసిన ఫోటోలో ఫ్రంట్ లుక్ కూడా చూడవచ్చు. ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో కనిపిస్తోంది. సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి.

Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, ఆరెంజ్ (గోల్డ్) కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. బ్యాక్ ప్యానెల్ పైన ఎడమవైపు పై భాగాన కెమెరా సెటప్ ఉంది. రెండు పెద్ద రింగ్స్ లో మూడు కెమెరా సెన్సర్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఓఐఎస్ ఫీచర్ కూడా ప్రింట్ చేయబడి ఉంది. ఫోన్ కి బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. పక్కనే స్పీకర్ గ్రిల్ ఉంది. మరొక వైపున 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది.

రీసెంట్ రిపోర్ట్ ద్వారా Vivo Y100 5G యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Vivo Y100 5G డివైజ్ 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది.

Vivo Y100 5G లో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.