ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y100 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందే ఈ ఫోన్ కొన్ని రాష్ట్రాల్లోని ఆఫ్ లైన్ స్టోర్స్ లో అమ్ముడవుతుండటం గమనార్హం. డివైజెస్ షార్టేజీ కారణంగా Vivo Y100 5G ని రంగంలోకి దింపినట్లు సమాచారం.
తాజాగా టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే Vivo Y100 5G యొక్క రెండర్స్ ని రివీల్ చేశాడు. ఇమేజెస్ ని బట్టి, Vivo Y100 5G డివైజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ తో రానుందని సమాచారం. సరే, Vivo Y100 5G యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
లీకైన Vivo Y100 5G రెండర్స్ ని ప్రకారం, ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, మందపాటి చిన్ తో వస్తోంది. గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో ఫోన్ కనిపిస్తోంది. గోల్డ్, బ్లూ కలర్ వేరియంట్స్ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్స్ ని కలిగి ఉంటాయి. అల్ట్రావయొలెట్ కిరణాలు పడినప్పుడు ఈ ఫోన్ల బ్యాక్ ప్యానెల్స్ కలర్ మారుతాయి.
Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటాయి. బాటమ్ లో స్పీకర్ గ్రిల్, టైప్-సీ చార్జింగ్ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. డివైజ్ కి టాప్ ఎడ్జ్ లో సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది.
Vivo Y100 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. లీకైన రెండర్స్ లో వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. Vivo Y100 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Vivo Y100 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ ఉంటుంది. హైబ్రిడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉంటుంది. Vivo Y100 5G డివైజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉండనుంది. లీక్ ని బట్టి, ఈ ఫోన్ 181 గ్రాములు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.24,999 ఉంటుందని సుదాన్శు అంబోరె చెబుతున్నాడు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
