వివో సంస్థ భారత్ లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Vivo Y100A ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గొప్ప ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో లాంచైంది. స్లీక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ మిగతా వాటి కంటే భిన్నంగా కనిపిస్తోంది. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్ తో వచ్చిన ఈ డివైజ్ ప్రీమియర్ లుక్ అండ్ ఫీల్ కలిగి ఉంది. మెటల్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్ మరియు పసిఫిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైంది. ఇక్కడ మీకోసం Vivo Y100A డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్ ని అందిస్తున్నాం. ఓసారి చూడండి.
Vivo Y100A స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్
- 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
- 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్
డిస్ప్లే: Vivo Y100A లో 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉన్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ అధికంగా ఉండటం వల్లన పట్టపగలు కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. మల్టీ టచ్ స్క్రీన్ వల్లన స్మూద్ మరియు రెస్పాన్సివ్ అనుభూతి యూజర్లకు కల్గుతుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజీ: Vivo Y100A లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడారు. 8జిబి ర్యామ్ సపోర్ట్ ని ఈ ఫోన్ కల్గి ఉంది. 128జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో Vivo Y100A డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది.
బ్యాటరీ మరియు చార్జింగ్: Vivo Y100A లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డివైజ్ ఎంతో వేగంగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
కెమెరా: Vivo Y100A స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. నైట్ మోడ్, పొట్రెయిట్ మోడ్, ఫోటో మోడ్, వీడియో మోడ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలో అందించారు.
కనెక్టివిటీ: Vivo Y100A లో వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ స్టాండ్ బై మోడ్ ఉంది. అంటే ఒకేసారి రెండు సిమ్స్ పని చేస్తాయి. 2జీ, 3జీ, 4జీ ఎఫ్‌డీడీ-ఎల్టీఈ, 5జీ ఎన్ఎస్ఏ, 5జీ ఎస్ఏ నెట్వర్క్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
సెన్సర్స్ మరియు ఇతర ఫీచర్స్: Vivo Y100A డివైజ్ లో యాక్సలరో మీటర్, ఆంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ మరియు జైరోస్కోప్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు. ఫోన్ బాక్స్ లో చార్జింగ్ అడాప్టర్ ఇచ్చారు.
Vivo Y100A ధర మరియు సేల్ తేదీ
Vivo Y100A స్మార్ట్ ఫోన్ లో ఉత్తమమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ నాణ్యతతో పాటు, సరసమైన ధరలో లభిస్తుందని కంపెనీ చెబుతోంది. Vivo Y100A ధర గురించి వివో సంస్థ అఫీషియల్ గా ఏమీ తెలపలేదు. లీకైన రిపోర్ట్స్ నిజమే అయితే గనుక, ఈ డివైజ్ ధర రూ.26,999గా ఉండే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
