ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని భారత్‌లో లాంచ్ చేసింది. Vivo Y18e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-రింగ్ డిజైన్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo Y18e యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y18e ధర, లభ్యత
Vivo Y18e స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. అయితే ఈ ఫోన్ ధర మరియు లభ్యత వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే వివో నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Vivo Y18e డివైజ్ స్పేస్ బ్లాక్ మరియు జెమ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo Y18e స్మార్ట్‌ఫోన్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్ పొందింది. ఐపీ54 రేటింగ్, ఎక్స్‌టెండెడ్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Vivo Y18e స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Vivo Y18e లో 6.56-ఇంచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269 పీపీఐ డెన్సిటీ, 528 నిట్స్ హై బ్రైట్నెస్, 70% ఎన్టీఎస్‌సీ గేముత్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y18e డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y18e డివైజ్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 64జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్: Vivo Y18e డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Vivo Y18e ఫోన్‌లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, వీజీఏ సెన్సర్, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Vivo Y18e లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 14 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo Y18e లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Vivo Y18e లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 150% బూస్టెడ్ వాల్యూమ్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Vivo Y18e డివైజ్ 163.63 మి.మీ పొడవు, 75.58 మి.మీ వెడల్పు, 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.
