Home News Vivo Y19s: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా రివీలైన వివో వై19ఎస్ స్టోరేజీ, బ్యాటరీ కెపాసిటీ వివరాలు

Vivo Y19s: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా రివీలైన వివో వై19ఎస్ స్టోరేజీ, బ్యాటరీ కెపాసిటీ వివరాలు

Highlights
  • త్వరలో Vivo Y19s విడుదల
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2419

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y19s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo Y19s ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

Vivo Y19s స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై V2419 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వివో వై19ఎస్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. రెండు ఐఎంఈఐ నంబర్లు లిస్టింగ్ పై కనిపించాయి. దీని ద్వారా వివో వై19ఎస్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ ద్వారా Vivo Y19s యొక్క బరువు, చుట్టుకొలత వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ 165.66 మి.మీ పొడవు, 76.03 మి.మీ వెడల్పు, 8.24 మి.మీ మందం, 198 గ్రాముల బరువు ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y19s డివైజ్ 5150 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రమోట్ చేయవచ్చు.

 

Vivo Y19s స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, రింగ్ లైట్ కనిపిస్తున్నాయి. ఇతర వివో ఫోన్ల మాదిరి డిజైన్ లాంగ్వేజీని ఈ ఫోన్ కూడా కలిగి ఉంది. బాటమ్ లో వివో లోగో ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే, Vivo Y19s స్మార్ట్‌ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ ఎఫ్టీఈ బ్యాండ్ 2/4/5/7/13/18/19/26/66 మరియు ఎల్టీఈ టీడీడీ బ్యాండ్ 38/41 ఉంటాయి. ఈ ఫోన్‌లో వై-ఫై 802.11ఏ, 802.11ఏ, 802.11బి, 802.11జి, 802.11ఎన్ (హెచ్‌టీ20/40), 802.11ఏసీ (వీహెచ్‌టీ20/40/80) ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ గెలీలియో, బీడీఎస్, గ్లొనాస్, జీపీఎస్, క్యూజెడ్ఎస్ఎస్, ఎస్‌బీఏఎస్, ఎఫ్ఎమ్ రిసీవర్ ఉంటాయి.

Vivo Y19s స్మార్ట్‌ఫోన్, 2019 నవంబర్‌లో లాంచైన Vivo Y19 కి సక్సెసర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. వివో వై19 రూ.13,990 తో భారత్‌లో లాంచ్ అయ్యింది. Vivo Y19s ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేయవచ్చు.

Vivo Y18s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y18s లో 6.56-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2GHz.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18s డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది. 6జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Vivo Y18s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y18s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y18s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y18s డివైజ్ లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.