ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y200 పేరుతో ఈ ఫోన్ రానుంది. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Tech Outlook ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అసలైతే, ఫోన్ ట్రెయినింగ్ మెటీరియల్ రివీల్ అయ్యింది. దీంతో ముఖ్యమైన ఫీచర్లు ఏంటో తెలిసాయి. సరే, ఓసారి Vivo Y200 కి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo Y200 5G డిజైన్ (లీక్)
- Vivo Y200 5G డిజైన్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 7.69 మి.మీ మందం, 2డీ గ్లాస్ రియర్ ప్యానెల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ బరువు 190 గ్రాములు ఉంటుందని అంచనా.
- ఇమేజ్ ని బట్టి, ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై కర్వ్డ్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సర్క్యులర్ కెమెరా కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, ఆరా లైట్ ఉన్నాయి.
- ఓవరాల్ గా Vivo Y200 5G స్మార్ట్ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
- తక్కువ బడ్జెట్ రేంజ్ లో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నారు.
Vivo Y200 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: లీక్ ప్రకారం, Vivo Y200 5G ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ అల్ట్రా విజన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 38 కలర్ టెంపరేచర్ లెవెల్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo Y200 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ఉంటుందని లీకైన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
- మెమొరీ: Vivo Y200 5G స్మార్ట్ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. దీంతో యూజర్ గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Vivo Y200 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వెడ్డింగ్ స్టైల్ ప్రొట్రెయిట్ మోడల్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.
- బ్యాటరీ: Vivo Y200 5G స్మార్ట్ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్ వంటి ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
