ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y200 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత కొన్ని రోజులుగా వివో Vivo Y200 5G డివైజ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. ఈలోపు Vivo Y200 5G డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా రెండర్స్ అందాయి. దీంతో కలర్ ఆప్షన్స్, ఆరా లైట్ ఫీచర్ బయటకు వచ్చాయి.
Vivo Y200 5G అఫీషియల్ రెండర్స్ (లీక్)
Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో డెజర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఆరా లైట్ డిజైన్ తో వస్తోంది. గతంలో మనం Vivo V27, Vivo V29 ఫోన్లలో ఈ ఫీచర్ ని చూసాం. ఇకపోతే Vivo Y200 5G డివైజ్ ఫ్లాట్ డిస్ప్లే, సన్నని బెజెల్స్ తో కనిపిస్తోంది.
Vivo Y200 5G స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడానున్నారు.
ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
