Home News త్వరలో లాంచ్ కానున్న Vivo Y200; టీజ్ చేసిన వివో!

త్వరలో లాంచ్ కానున్న Vivo Y200; టీజ్ చేసిన వివో!

Highlights
  • Y100 కి సక్సెసర్ గా వస్తోన్న Vivo Y200
  • ఫిబ్రవరిలో భారత్ లో లాంచైన Vivo Y200
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo రీసెంట్ గా భారతీయ మార్కెట్ లో Vivo Y100 మరియు Vivo Y100A ఫోన్ల ధరలను తగ్గించింది. ఈలోపు తన కొత్త డివైజ్ Vivo Y200 ని లాంచ్ చేసేందుకు వివో సన్నద్ధమవుతోంది. ఇటీవలె Vivo Y200 గురించి లీక్స్ రావడం ప్రారంభమైంది. తాజాగా వివో కంపెనీ అధికారికంగా Vivo Y200 భారత లాంచ్ ని టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. అయితే వివో ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. సరే, ఓసారి Vivo Y200 ఇండియా లాంచ్ టైమ్‌లైన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 అఫీషియల్ టీజర్

స్టైల్ గెట్స్ అండ్ అప్‌గ్రేడ్ అనే క్యాప్షన్ తో వివో ఇండియా Vivo Y200 టీజర్ షేర్ చేసింది. గత మోడల్ తో పోల్చితే Vivo Y200 అప్‌డ్రేడెడ్ డిజైన్ తో రానున్నట్లు స్పష్టమవుతోంది. ఇంకా మరే విషయాలను వివో వెల్లడించలేదు.

కానీ, కొన్ని రోజుల క్రితం Vivo Y200 స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది. మరి, ఆ లీకైన స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం.

Vivo Y200 స్పెసిఫికేషన్స్