ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ హ్యాండ్సెట్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్టైంది. 8జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. సరే, ఓసారి Vivo Y200 Pro 5G డివైజ్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y200 Pro 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
- Vivo Y200 Pro 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై V2303T అనే ప్రోడక్ట్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా Vivo Y200 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo Y200 Pro 5G లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 440 డీపీఐ స్క్రీన్ డెన్సిటీ ఉంటాయి.
- చిప్సెట్: Vivo Y200 Pro 5G లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి. ఈ చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- ర్యామ్: Vivo Y200 Pro 5G డివైజ్ లో 8జిబి ర్యామ్ ఉంటుందని గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Vivo Y200 Pro 5G ఫోన్ గతంలో లాంచైన Vivo V29e ఫోన్‌కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందింది. అంటే వివో వీ29ఈ లోని స్పెసిఫికేషన్స్ Vivo Y200 Pro లో ఉండే అవకాశం ఉంది.
