Vivo: ఏప్రిల్ 20న చైనాలో లాంచ్ అవుతోన్న Y200i 5G

Highlights

  • ఏప్రిల్ 20న చైనాలో Vivo Y200i 5G లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ చార్జింగ్
  • బ్లూ, బ్లాక్ మరియు తెలుపు రంగులు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i 5G పేరుతో ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా ఖరారు చేసింది. ఏప్రిల్ 20వ తేదీన ఈ ఫోన్ అక్కడ లాంచ్ అవ్వనుంది. ఓసారి Vivo Y200i 5G యొక్క టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y200i 5G టీజర్ విడుదల

వివో సంస్థ తన తదుపరి ఫోన్ Vivo Y200i 5G యొక్క లాంచ్ తేదీని టీజర్ ద్వారా ఖరారు చేసింది.

టీజర్ ప్రకారం, Vivo Y200i 5G డివైజ్ ఏప్రిల్ 20వ తేదీన చైనాలో లాంచ్ కానుందని అర్థమవుతోంది.

Vivo Y200i 5G డివైజ్ బ్లూ, బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని పోస్టర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

ఫోన్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.

Vivo Y200i 5G డివైజ్ సేల్ చైనాలో ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. భారత మార్కెట్ లో Vivo Y200i 5G డివైజ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Vivo Y200i 5G ధర (అంచనా)

చైనా టెలీకామ్ లిస్టింగ్ ప్రకారం, Vivo Y200i 5G ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవ్వనుంది. వాటి ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

Vivo Y200i 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1,799 యువాన్లు (సుమారు రూ.21,200) ఉండవచ్చు.

Vivo Y200i 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1,899 యువాన్లు (సుమారు రూ.22,300) గా ఉండవచ్చు.

Vivo Y200i 5G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ.23,500) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo Y200i 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Vivo Y200i 5G లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y200i 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం.

కెమెరా: Vivo Y200i 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo Y200i 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y200i 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y200i 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

సెక్యూరిటీ: Vivo Y200i 5G లో ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటుంది. దీని వల్లన ఫోన్‌కి దుమ్ము మరియు నీటి నుంచి రక్షణ లభిస్తుంది.

బరువు, మందం: Vivo Y200i 5G డివైజ్ 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.