Home News 6.5-inch డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y22: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత

6.5-inch డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y22: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత

హైలైట్స్:

Vivo Y22 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ కెమెరా సెన్సర్స్, సన్నని బెజెల్స్ కలిగి ఉంది. Vivo Y22 లో 3.5ఎంఎం ఆడియో జాక్, సెకండరీ మైక్ ఉన్నాయి. వివో ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అమ్ముడవ్వనున్న Vivo Y22.

భారత్ లో Vivo Y22 ధర, సేల్ వివరాలు

Vivo Y22 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. అవి: స్టార్‌లిట్ బ్లూ, మెటావర్స్ గ్రీన్. ఈ ఫోన్ ని ఆఫ్ లైన్ ద్వారా ఎస్బీఐ, కొటక్ మహింద్ర, వన్ క్రెడిట్ కార్డ్స్ తో కొంటే రూ.1000 క్యాష్ బ్యాక్ లభించనుంది. ఆన్ లైన్ ద్వారా కొనే కస్టమర్లకు రూ.750 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Vivo Y22 స్పెసిఫికేషన్స్

Vivo Y22 లో 6.5 అంగుళాల హెచ్డీ+ 2.5డీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 530 నిట్స్ బ్రైట్నెస్, బ్లూ-లైట్ ఫిల్టర్, యాంటీ-గ్లేర్ సర్ఫేస్, మీడియాటెక్ ఎంటీ6769 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌ప్యాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo Y22 స్మార్ట్ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 2ఎంపి సెకండరీ సెన్సర్. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ని ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 8ఎంపి కెమెరాను అందించారు.

ఈ హ్యాండ్సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్ ని కలిగి ఉంది. 4జీ కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. Vivo Y22 లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంది.

Vivo Y22 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. అవి: స్టార్‌లిట్ బ్లూ, మెటావర్స్ గ్రీన్. ఈ ఫోన్ ని ఆఫ్ లైన్ ద్వారా ఎస్బీఐ, కొటక్ మహింద్ర, వన్ క్రెడిట్ కార్డ్స్ తో కొంటే రూ.1000 క్యాష్ బ్యాక్ లభించనుంది. ఆన్ లైన్ ద్వారా కొనే కస్టమర్లకు రూ.750 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.