Home News లాంచ్‌కి ముందు లీకైన Vivo Y27 5G స్పెసిఫికేషన్స్, రెండర్స్

లాంచ్‌కి ముందు లీకైన Vivo Y27 5G స్పెసిఫికేషన్స్, రెండర్స్

Highlights
  • ఈ నెలలో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo Y27 5G
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్, రెండర్స్
  • డైమెన్సిటీ 6020 తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో గ్లోబల్ గా Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని (@passionategeekz) Vivo Y27 5G డివైజ్ రెండర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో డివైజ్ యొక్క కలర్ ఆప్షన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఈ టిప్‌స్టర్ ఇంకా స్పెసిఫికేషన్స్ కూడా లీక్ చేశారు.

రెండర్స్ ద్వారా రివీలైన Vivo Y27 5G డిజైన్, కలర్స్

ఈ నెలలోనే Vivo Y27 5G లాంచ్ కానుందని టిప్‌స్టర్ PassionateGeekz ద్వారా తెలిసింది. టిప్‌స్టర్ నుంచి హై రెజుల్యూషన్ రెండర్స్ లీక్ అయ్యాయి. వీటి ద్వారా కలర్ ఆప్షన్స్ బయటకు వచ్చాయి. ఒబ్సిడియన్ బ్లాక్, స్టార్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ రెండర్స్ లో కనిపించాయి. ఒబ్సిడియన్ బ్లాక్ వేరియంట్ సిల్క్ మ్యాట్ ఫినిషింగ్ తో వస్తోందని తెలుస్తోంది. పుర్పుల్ మోడల్ అయితే మిరుమిట్లు గొలిపే అరోరా ఫినిషింగ్ తో మల్టీ కలర్ లుక్ తో కనిపిస్తోంది.

Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ రౌండెడ్ బాక్సీ బాడీని కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై స్క్రేర్ షేప్డ్ డ్యూయల్-కెమెరా యూనిట్ ఉంది. ఇందులో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇదే తరహా కెమెరా మాడ్యూల్స్ ఇదివరకు ఒప్పో, వన్‌ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లలో కనిపించాయి. మాడ్యూల్ లో రెండు భారీ కెమెరా కటౌట్స్, ఒక సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. డివైజ్ కి ఎడమవైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. Vivo Y27 5G కి ముందు వైపున వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో కూడిన డిస్ప్లే ఉంది.

Vivo Y27 5G స్పెసిఫికేషన్స్ (లీక్)