సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo Y27 5G; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేయనున్న వివో
  • Vivo Y27 5G పేరుతో వస్తోన్న డివైజ్
  • డైమెన్సిటీ 6020 చిప్ ఫోన్ లో ఉండే అవకాశం

మొబైల్ తయారీదారు Vivo త్వరలో కొత్త 5G స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. త్వరలో లాంచ్ కాబోయే ఈ స్మార్ట్ ఫోన్ Vivo Y27 5G పేరుతో వస్తోంది. తాజాగా ఈ డివైజ్ NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు కీలక విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి, వెబ్‌సైట్‌లో తెలపబడిన లిస్టింగ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్‌లను వివరంగా తెలుసుకోండి.

Vivo Y27 5G NBTC లిస్టింగ్

Vivo యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V2302 మోడల్ నంబర్‌తో NBTC సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. ఫోన్ Vivo Y27 5G పేరు లిస్టింగ్‌లో నిర్ధారించబడింది. ప్రస్తుతం, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ మరియు టెలికమ్యూనికేషన్ కమిషన్‌పై ఇతర సమాచారం ఏదీ అందలేదు. అయితే Vivo తన కొత్త 5G ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుందని భావిస్తున్నారు.

Vivo Y27 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo Y27 5G లో 6.44-ఇంచ్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ గీక్‌బెంచ్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో కనిపించింది. దీంతో ఇదే చిప్సెట్ తో ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
  • స్టోరేజీ: Vivo Y27 5G డివైజ్ బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ని కలిగి ఉంటుంది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Vivo Y27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ బొకే కెమెరా లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • బ్యాటరీ: Vivo Y27 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం.
  • ఓఎస్, కనెక్టివిటీ: Vivo Y27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఈ ఫోన్ లో ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y27 5G లో ఐపీ54 రేటింగ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
Previous articleలీకైన Samsung Galaxy A25 5G ఇమేజెస్; రివీలైన డిజైన్!
Next article50mp కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 5
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.