ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా తన స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. మూడు స్మార్ట్ఫోన్ల ధరలను వివో తగ్గించింది. వీటిలో Vivo Y27, Vivo T2 5G 6gb, Vivo T2 5G 8gb మోడల్స్ ఉన్నాయి. ఈ డివైజెస్ పై రూ.1,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్లు కొనాలని భావిస్తున్న వారికి మంచి అవకాశమని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల కొత్త ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo Y27 ధర
- Vivo Y27 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారతీయ మార్కెట్ లో రూ.12,999 గా ఉంది.
- Vivo Y27 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.11,999 కి చేరుకుంది. అంటే రూ.1,000 డిస్కౌంట్ యూజర్ కి లభిస్తుంది.
Vivo T2 5G 6GB వేరియంట్ ధర
Vivo T2 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.16,999 గా ఉంది. రూ.1,000 డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.15,999 కి చేరుకుంది.
Vivo T2 5G 8GB వేరియంట్ ధర
Vivo T2 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.18,999 గా ఉంది. రూ.1,000 డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.17,999 కి చేరుకుంది.
Vivo Y27 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది.
- రియర్ కెమెరా: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా ఉన్నాయి.
- సెల్ఫీ కెమెరా: Vivo Y27 4G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
- చిప్సెట్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
- స్టోరేజీ, ర్యామ్: Vivo Y27 4G డివైజ్ లో 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Vivo Y27 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Y27 4G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.0, వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్/5 గిగాహెర్ట్జ్, టైప్-సీ పోర్ట్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
- డైమెన్షన్స్: Vivo Y27 4G డివైజ్ 8.07 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
Vivo T2 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo T2 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే తో ఈ ఫోన్ వచ్చింది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo T2 5G 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
- కెమెరా: Vivo T2 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, ఒక ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఓఎస్: Vivo T2 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Vivo T2 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కలర్ ఆప్షన్స్: Vivo T2 5G వెలాసిటీ వేవ్ మరియు నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Vivo T2 5G డివైజ్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.80 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉంటుంది.
- కనెక్టివిటీ: Vivo T2 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
