ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సంస్థ నేడు ఇండోనేషియాలో Vivo Y27s డివైజ్ ని లాంచ్ చేసింది. Vivo Y27, Vivo Y27 5G లతో పోల్చితే Vivo Y27s లో స్పెసిఫికేషన్స్ వేరుగా ఉన్నాయి. Vivo Y27s ఫోన్ 6.64-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ54 రేటింగ్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y27s ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo Y27s ధర, లభ్యత
- Vivo Y27s డివైజ్ బర్గండీ బ్లాక్ మరియు గార్డెన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Vivo Y27s 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 23,99,000 (సుమారు రూ.12,800) గా ఉంది.
- 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 27,99,000 (సుమారు రూ.14,900) గా ఉంది.
Vivo Y27s స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y27s లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 650 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y27s లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Vivo Y27s డివైజ్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్వేర్: Vivo Y27s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo Y27s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Vivo Y27s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo Y27s లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఓటీజీ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- చుట్టుకొలత, బరువు: Vivo Y27s డివైజ్ 164.06 మి.మీ పొడవు, 76.17 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
