ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే Vivo Y27s డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా కంపెనీ ప్రకటించలేదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, Vivo Y27s డివైజ్ కొన్ని రోజుల క్రితం బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కనిపించింది. తాజాగా టీకేడీఎన్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కూడా దర్శనమిచ్చింది. దీంతో Vivo Y27s కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo Y27s TKDN లిస్టింగ్ వివరాలు
- వివో నుంచి రాబోవు కొత్త ఫోన్ టీకేడీఎన్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై V2322 మోడల్ నంబర్ తో కనిపించింది.
- టీకేడీఎన్ వెబ్సైట్ లిస్టింగ్ లో Vivo Y27s డివైజ్ 35.98 పర్సెంట్ వాల్యూని చేరుకోగల్గింది.
- 4జీ కనెక్టివిటీతో వస్తోన్న Vivo Y27s డివైజ్ 2జీ, 3జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.
- త్వరలోనే Vivo Y27s డివైజ్ గ్లోబల్ గా కూడా లాంచ్ కానుందని టీకేడీఎన్ లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అవుతోంది.
- ఏదేమైనా, వివో నుంచి గ్లోబల్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Vivo Y27s Bluetooth SIG లిస్టింగ్
- Vivo Y27s డివైజ్ కొన్ని రోజుల క్రితం బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్సైట్ పై V2322 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Vivo Y27s డివైజ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా ఖరారైంది.
- ఇది కాకుండా, లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
Vivo Y27s ధర (అంచనా)
4జీ కనెక్టివిటీతో లాంచ్ కానున్న Vivo Y27s డివైజ్ తక్కువ ధరకే లభించనుందని అంచనా వేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. లాంచ్ సమయంలో అసలు ధర రివీల్ అయితే గానీ ఏ విషయం చెప్పలేం. సరే, ఓసారి Vivo Y27 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Vivo Y27 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y27 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2388*1080 పిక్సెల్స్), వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y27 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
- మెమొరీ: Vivo Y27 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా 6జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Vivo Y27 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Vivo Y27 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo Y27 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
