
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. వేరే, లీక్స్ ద్వారా బ్యాటరీ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Vivo Y300 Pro 5G 3సీ లిస్టింగ్ వివరాలు
Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ సైట్ 3సీ పై V2410A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
Vivo Y300 Pro 5G డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇది తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
Vivo Y300 సిరీస్ యొక్క వివరాలను త్వరలోనే వివో సంస్థ వెల్లడించనుందని 3సీ ద్వారా తెలుస్తోంది.
టిప్‌స్టర్ పండా ఈజ్ బాల్డ్ ప్రకారం, Vivo Y300 Pro 5G డివైజ్ 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో ఇదే అత్యంత శక్తివంతమైన బ్యాటరీ అని చెప్పవచ్చు. యూజర్లకు రెండు రోజుల బ్యాకప్‌ను ఈ బ్యాటరీ అందించనుందని సమాచారం. అయితే ఈ వివరాలు నిజమా? కాదా? అనే విషయం త్వరలో తెలియనుంది.

Vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo Y200 Pro 5G లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y200 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ అందించారు.
కెమెరా: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Vivo Y200 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.
కనెక్టివిటీ: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











