హైలైట్స్:
- చైనాలో లాంచ్ అయిన Vivo Y32t స్మార్ట్ ఫోన్
- బడ్జెట్ శ్రేణిని టార్గెట్ చేస్తూ వస్తోన్న Vivo Y32t ఫోన్ ధర రూ.12,000
- మీడియాటెక్ హీలియో జీ70, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్స్ తో లాంచ్ అయిన Vivo Y32t
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Vivo తన హోమ్ మార్కెట్ అయిన చైనాలో Vivo Y52t ఫోన్ ని 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో రూ.14,800 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. Vivo Y52t 5G ఫోన్ లాంచ్ తర్వాత Vivo Y32t అనే 4జీ మోడల్ ని వివో మార్కెట్ లోకి వదిలింది. దీని ధర రూ.12,500. Vivo Y32t రెండు మోడల్స్ లో లాంచ్ కాబడింది. ఒకటి మీడియాటెక్ హీలియో జీ70 చిప్ కలిగి ఉండగా, మరొక మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ కలిగి ఉంటుంది.
Vivo Y32t స్పెసిఫికేషన్స్
Vivo Y32t 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120*1600 పిక్సెల్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ స్టైల్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 89 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 పీపీఐ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది.
Vivo Y32t రెండు చిప్సెట్ మోడల్స్ లో విడుదలైంది. ఒకటి మీడియాటెక్ హీలియో జీ70 చిప్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 128జిబి యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజీ కలిగి ఉంది. మరొక మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ కలిగి ఉంది.
ఇప్పుడు Vivo Y32t కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. Vivo Y32t కెమెరా సెటప్ Vivo Y52T ని పోలి ఉంది. Vivo Y32t లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 13ఎంపి ప్రైమరీ లెన్స్ కాగా, రెండోది 2ఎంపి లెన్స్. వెనకాల డ్యూయల్ కెమెరాలతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
Vivo Y32t డ్యూయల్ సిమ్ 4జీ వోల్టీ సపోర్ట్ కలిగి ఉంది. ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Vivo Y32t ధర
Vivo Y32t యొక్క మీడియాటెక్ హీలియో జీ70 మోడల్ ధర 1099 యువాన్లు (రూ.12,500) గా ఉంది. ఇక స్నాప్ డ్రాగన్ 680 మోడల్ ధర 1299 యువాన్లు 9 (రూ.14,800) గా నిర్ణయించారు. భారత మార్కెట్ లో ఇంకా ఈ ఫోన్లు లాంచ్ కావాల్సి ఉంది. వీటి లాంచ్ తేదీని వివో త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఇక భారత్ లో ఈ ఫోన్ల ధరలు వేరుగా ఉండే చాన్సెస్ ఉన్నాయి. త్వరలోనే ఈ ఫోన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.