హైలైట్స్:
- త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న వివో వై35 4జీ స్మార్ట్ ఫోన్
- లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తెస్తున్న ఫోన్ వివో వై35
- స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
వివో వై35 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో రెడీ అవుతోంది. ముంబైకి చెందిన రిటైలర్ మహేశ్ టెలీకామ్ వివో వై35 కి సంబంధించిన టీజర్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా బయటకు వదిలింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ఫష్టమైంది. ఈ పోస్టర్ ద్వారా ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్, ముఖ్యమైన ఫీచర్లు ఏంటో తెలిశాయి. ఈ నెల మొదట్లో ఇండోనేషియాలో లాంచ్ అయిన ఫోన్, వివో వై35 ఫోన్ ఒకటేనని 91మొబైల్స్ కన్ఫర్మ్ చేస్తోంది. 4జీ కనెక్టివిటీ తో వస్తున్న ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Vivo Y35 స్పెసిఫికేషన్స్
Coming soon #VivoY35 pic.twitter.com/qX3WOQLk9S
— Mahesh Telecom (@MAHESHTELECOM) August 22, 2022
వివో వై35 లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ను అమర్చారు. 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఆప్షన్ ఇందులో ఉంది. ఈ హ్యాండ్సెట్ లో 50 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
వివో వై35 లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16 ఎంపి కెమెరాను అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆఫ్ లైన్ మార్కెట్స్ ద్వారా ఈ ఫోన్ విక్రయించబడుతుంది.
Vivo Y35 ఇండియా లాంచ్
పోస్టర్ ద్వారా వివో వై35 ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే వివో ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. అలాగే భారత్ లో వివో వై35 ధరకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఇంకా లేదు. ఇండోనేషియాలో IDR 33,99,000 (దాదాపు రూ.18,500) గా ఈ ఫోన్ ధర ఉంది.
ప్రైస్‌బాబా నివేదిక ప్రకారం, వివో వై35 ఫోన్ ని ఎస్బీఐ, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ.1,000 క్యాష్ బ్యాక్ లభించనుందని తెలుస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్, టెలీకామ్, ఆటోమొబైల్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.