హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Vivo Y35
- 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 44వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- భారత్ లో Vivo Y35 ధర రూ.18,499
Vivo Y35 ఇండియా లాంచ్: Vivo Y35 అనే కొత్త స్మార్ట్ ఫోన్ ని వివో కంపెనీ భారత్ లో నేడు లాంచ్ చేసింది. రూ.18,499 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
Vivo Y35 స్పెసిఫికేషన్స్
Vivo Y35 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఇది 2408*1080 రెజుల్యూషన్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్లో ఫ్లాట్ ఫ్రేమ్, 2.5 కర్వ్డ్ గ్లాస్, ఆంటీ-గ్లేర్ సర్ఫేస్ ఉన్నాయి. ఏజీ సర్ఫేస్ ఫింగర్ ప్రింట్ ని అట్రాక్ట్ చేయదు. దీంతో ఫోన్ లుక్ ఎప్పుడూ బాగుంటుంది.
Vivo Y35 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 పై పని చేస్తుంది. ఇక ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ను వాడారు. ఇది 6 నానోమీటర్ ప్లాట్ఫామ్ పై తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్. 2.4 గిగాహెర్ట్జ్ స్పీడ్ ని ఈ ప్రాసెసర్ కలిగి ఉంది. Vivo Y35 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ ఈ ఫోన్లో ఉంది.
Vivo Y35 లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.8 అపర్చర్), 2ఎంపి బొకే లెన్స్ (ఎఫ్/2.4 అపర్చర్), 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. Vivo Y35 లో సెల్పీలు, వీడియో కాల్స్ కొరకు 16 ఎంపి కెమెరా ను అమర్చారు. Vivo Y35 డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కొరకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. పవర్ కొరకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Vivo Y35 ధర, విక్రయం
Vivo Y35 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభించనుంది. దీని ధర రూ.18,499. అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్, వన్ కార్డ్ యూజర్లు Vivo Y35 కొనుగోలు పై రూ.1000 డిస్కౌంట్ పొందుతారు. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. వివో ఇండియా ఆన్ లైన్ స్టోర్స్ మరియు ఆఫ్ లైన్ రిటైలర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.