Home News రివీలైన Vivo Y35m+ 5G ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు

రివీలైన Vivo Y35m+ 5G ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు

Highlights
  • చైనాలో తొలుత అమ్ముడవ్వనున్న Vivo Y35m+
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్న డివైజ్
  • ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు తక్కువ

వివో సంస్థ జనవరి నెలలో Vivo Y35m డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదే వరుసలో Vivo Y35m+ 5G కూడా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చైనాకి చెందిన టెలీకామ్ వెబ్ సైట్ లో Vivo Y35m+ 5G డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధర, ఫోటోలు, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

సరే, ఓసారి Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తో పాటు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y35m+ 5G లాంచ్ మరియు సేల్

Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ వార్త ప్రచురించే సమయానికి, వివో చైనా వెబ్ సైట్ లో కూడా ఈ ఫోన్ లిస్ట్ అవ్వలేదు. కానీ, మరోవైపున ఈ స్మార్ట్ ఫోన్ చైనా టెలీకామ్ వెబ్ సైట్ లో V2279A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. అలాగే Vivo Y35m+ 5G ఫోన్ చైనాలో మే 25 నుంచి సేల్ కి వస్తుందని తెలిసింది. అంటే మరో ఒకట్రెండు రోజుల్లో అఫీషియల్ గా ఫోన్ లాంచ్ కానుందని భావించవచ్చు.

Vivo Y35m+ 5G ధర

Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్నట్లు టెలీకామ్ సైట్ లిస్టింగ్ లో ఉంది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేయగా, టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. 128జిబి వేరియంట్ ధర CNY 1599 (సుమారు రూ.18,900), 256జిబి వేరియంట్ ధర CNY 1799 (సుమారు రూ.20,900) గా ఉన్నాయి. Vivo Y35m+ 5G ఫోన్ స్టార్ రింగ్ బ్లాక్, రిపుల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y35m+ 5G స్పెసిఫికేషన్స్