
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ఓ లీక్ బయటకు వచ్చింది. ఈ లీక్ ద్వారా Vivo Y36 4G డివైజ్ ధర శ్రేణి, లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసాయి. ఈలోపు టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Vivo Y36 4G డివైజ్ భారత్ లో జూన్ మూడో వారంలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.
అయితే టిప్‌స్టర్ పారస్ గుగ్లాని కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, Vivo Y36 4G ధర శ్రేణిని గుగ్లాని వెల్లడించారు. ఓసారి Vivo Y36 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.
Vivo Y36 4G ధర (లీక్)
భారత్ లో Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని సమాచారం. Vivo Y36 4G ధర రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని టిప్‌స్టర్ గుగ్లాని చెబుతున్నారు.
Vivo Y36 4G డివైజ్ ఇప్పటికే ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఇండోనేషియన్ వేరియంట్ లో ఉన్న హార్డ్‌వేర్ ఇండియన్ వేరియంట్ లో కూడా ఉండే అవకాశం ఉంది. Vivo Y36 4G ఇండియా వేరియంట్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ని గుగ్లాని వెల్లడించలేదు. అయితే ఇండోనేషియన్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. దీని ధర IDR 3,399,000 (సుమారు రూ.18,700) గా ఉంది.
Vivo Y36 4G డివైజ్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ పాలికార్బొనెట్ బ్యాక్, ఫ్రేమ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ప్లే, ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ఉన్నాయి. టిప్‌స్టర్ తెలిసిన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇండోనేషియన్ వేరియంట్ ని పోలి ఉన్నాయి.
Vivo Y36 4G స్పెసిఫికేషన్స్ (రూమర్స్)
- డిస్ప్లే: Vivo Y36 4G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo Y36 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: ఇండోనేషియన్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.
- బ్యాటరీ, చార్జింగ్: Vivo Y36 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- సాఫ్ట్వేర్: Vivo Y36 4G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- డైమెన్షన్స్: Vivo Y36 4G డివైజ్ 164.06 మి.మీ పొడవు, 76.17 మి.మీ వెడల్పు, 8.07 మి.మీ మందం, 202 గ్రాముల బరువు ఉంటుంది.
- ఇతర స్పెసిఫికేషన్స్: Vivo Y36 4G డివైజ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ ని కలిగి ఉంది. ఇంకా ఇందులో బ్లూటూత్ 5.1, జీపీఎస్, వై-ఫై, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.











