Vivo Y36 4G ఫోన్ చాలా రోజులుగా టెక్ ప్రపంచంలో హెడ్‌లైన్స్‌లో ఉంది. దీని అంచనా స్పెసిఫికేషన్లు మరియు ధర వివిధ లీక్స్ ద్వారా రివీల్ అయ్యాయి. అయితే నేడు 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా Vivo Y36 ధర మరియు స్పెసిఫికేషన్ల వివరాలను అందిస్తోంది. ఈ సమాచారం రిటైల్ సోర్సెస్ ద్వారా మాకు అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo Y36 4G ధర
Vivo బ్రాండ్‌తో అనుబంధం ఉన్న ఒక రిటైల్ సోర్స్ Vivo Y36 డివైజ్ భారతదేశంలో రూ.16,999 ధరతో లాంచ్ కానుందని తెలిపింది. ఈ ఫోన్ సింగిల్ మెమరీ వేరియంట్‌లో మాత్రమే మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఇందులో 8 GB RAM ఇవ్వబడుతుంది.
ICICI బ్యాంక్, SBI కార్డ్, AU బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంక్ కార్డ్ లపై కూడా కంపెనీ రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ జూన్ 30, 2023 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో 90 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది. గ్లాస్ ఫినిష్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది. Vivo Y36 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. Vivo Y36 డివైజ్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉండనుంది. అంటే యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభించనుంది. Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పూర్తి స్పెసిఫికేషన్స్ ఇక్కడ పాయింట్స్ రూపంలో అందిస్తున్నాం. ఓసారి చదివేయండి.
Vivo Y36 4G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో 90 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది. గ్లాస్ ఫినిష్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.
- ర్యామ్: Vivo Y36 డివైజ్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉండనుంది. అంటే యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభించనుంది.
- రియర్ కెమెరా: Vivo Y36 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo Y36 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
- చార్జింగ్: Vivo Y36 స్మార్ట్ ఫోన్ 44 వాట్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీతో వస్తోంది. దీని ద్వారా బ్యాటరీ అతి త్వరగా చార్జ్ అవుతుంది.
