ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo Y36 4G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ గురించి టిప్‌స్టర్ సుదాన్శు 91మొబైల్స్ కి సమాచారం అందించారు. దీంతో Vivo Y36 4G యొక్కస్పెసిఫికేషన్స్, ఫీచర్లు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y36 4G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- ఫుల్ హెచ్డీ+ స్క్రీన్
- 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2388*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
చిప్సెట్, ర్యామ్
- స్నాప్ డ్రాగన్ 680 చిప్
- 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్
Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ లో 8జిబి ఇంటర్నల్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ లభిస్తుంది. అలాగే 256జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.
కెమెరా విభాగం
- 50ఎంపి రియర్ కెమెరా
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
బ్యాటరీ, చార్జింగ్
- 5000 ఎంఏహెచ్
- 44 వాట్ చార్జింగ్
Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది.
ఓఎస్, కనెక్టివిటీ
- ఆండ్రాయిడ్ 13
- 4జీ
Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.1, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
