Home News బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన Vivo Y36 4G, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన Vivo Y36 4G, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • తక్కువ ధరలో వస్తోన్న Vivo Y36 4G స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • లీక్స్ ద్వారా రివీలైన కెమెరా మరియు ఇతర సమాచారం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Vivo Y36 4G డివైజ్ ని వివిధ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. తొలుత ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే వివో ఇంకా Vivo Y36 4G డివైజ్ గురించి అఫీషియల్ గా సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే, లాంచ్ కి ముందు Vivo Y36 4G డివైజ్ Blutooth SIG సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది.

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ యొక్క బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ లిస్ట్ ద్వారా డివైజ్ రానున్న కొన్ని రోజులు లేదా వారాల్లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. Vivo Y36 4G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y36 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo Y36 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ముందు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ V2247 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. తొలుత ఈ లిస్టింగ్ ని PriceBaba వెబ్ సైట్ గుర్తించింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్, కెమెరా తదితర వివరాలు తెలిసాయి.

Vivo Y36 4G గురించి గతంలో కొన్ని లీక్స్ వచ్చాయి. ఇదివరకు గీక్‌బెంచ్ వెబ్ సైట్ పై ఈ ఫోన్ కనిపించింది. దీంతో చిప్సెట్ వివరాలు తెలిసాయి. ఓసారి Vivo Y36 4G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y36 4G స్పెసిఫికేషన్స్ (లీక్స్)

డిస్ప్లే

Vivo Y36 4G డివైజ్ లో 6.8-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ లేదా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.

కెమెరా, బ్యాటరీ

Vivo Y36 4G లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇతర సెన్సర్స్ గురించి తెలియదు. అయితే ఈ ఫోన్ డ్యూయల్ లేదా ట్రిపుల రియర్ కెమెరా సెటప్ తో రావొచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ రానుందని సమాచారం.

చిప్సెట్

Vivo Y36 4G డివైజ్ లో మీడియాటెక్ మీలియో జీ99 చిప్సెట్ వాడనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ తో రానుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

స్టోరేజీ, ఓఎస్

Vivo Y36 4G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చే చాన్స్ ఉంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ ఉండవచ్చు. ఇంకా ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 లేదా ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో రానుంది. మార్కెట్ ని బట్టి కస్టమ్ స్కిన్ మారుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.