ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో జూన్ నెలలో Vivo Y36 డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ Vivo Y36m చైనాలో లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా, Vivo Y36m డివైజ్ చైనా టెలీకామ్ వెబ్సైట్ లో లిస్టైంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ గుర్తించింది. లిస్టింగ్ ద్వారా Vivo Y36m డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo Y36m ధర
Vivo Y36m డివైజ్ యొక్క బేస్ మోడల్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను CNY 1,499 (సుమారు రూ.17,200) గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,799 (సుమారు రూ.20,600) గా ఉంది.
Vivo Y36m స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y36m లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo Y36m లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ లేదా 6020 చిప్ ఉండే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడే అవకాశం ఉంది.
- ఓఎస్: Vivo Y36m డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo Y36m లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఆగ్జిలరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo Y36m లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Vivo Y36m లో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Y36m లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
- కలర్ ఆప్షన్స్: Vivo Y36m డివైజ్ గ్రీన్ గేజ్, బ్లాక్ ఇంక్స్టోన్ కలర్ ఆప్షన్స్ లో రానుంది.
