ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి ఒక చవకైన ఫోన్ లాంచ్ అయ్యింది. Vivo Y36t పేరుతో వచ్చిన ఈ డివైజ్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇంకా 6.56-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Vivo Y36t ధర
Vivo Y36t చైనాలో జింగ్‌డాంగ్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధరను 749 యువాన్లు (సుమారు రూ.8,605) గా ఉంది. ఇది డిస్కౌంట్ ధర. ఆఫర్ ముగిసాక, ఫోన్ ధర 799 యువాన్లు (సుమారు రూ.9,179) కి చేరుతుంది.
Vivo Y36t స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo Y36t లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
చిప్సెట్: Vivo Y36t లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0GHz.
బ్యాటరీ: Vivo Y36t లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: Vivo Y36t లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
ఓఎస్: Vivo Y36t స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo Y36t లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Vivo Y36t లో 150% లౌడ్ వాల్యూమ్ మోడ్, ఐపీ54 సర్టిఫికేషన్ ఉన్నాయి.
