Home News మరొక 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన Vivo

మరొక 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన Vivo

హైలైట్స్:

Vivo కంపెనీ ఇటీవల Vivo Y32t, Vivo Y52t 5G, Vivo Y72t 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇదే క్రమంలో వివో సంస్థ వై-సిరీస్ లో Vivo Y52 (2022) అనే మరొక స్మార్ట్ ఫోన్ ని తాజాగా తైవాన్ లో లాంచ్ చేసింది. Vivo Y52 (2022) లో 48ఎంపి కెమెరా, 4జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దాదాపు రూ.20,000 ధరతో తైవాన్ లో ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంది. అసలైతే Vivo Y52 (2021) డివైజ్ 2021 మే నెలలో యూరప్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు అదే డివైజ్ ని Vivo Y52 (2022) పేరుతో తైవాన్ లో లాంచ్ చేసింది. Vivo Y52 (2022) యొక్క ఇతర ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

Vivo Y52 (2022)

Vivo Y52 (2022) యొక్క స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. Vivo Y52 (2022) లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ, 90.6 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి. Vivo Y52 (2022) 163.95 మిల్లీ మీటర్ల పొడవు, 75.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 193 గ్రాముల బరువు ఉంటుంది.

Android 12 ఓఎస్, FunTouch OS 12 కస్టమ్ స్కిన్ తో Vivo Y52 (2022) ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది.

ఇప్పుడు Vivo Y52 (2022) యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 48 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. Vivo Y52 (2022) స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

Vivo Y52 (2022) డ్యూయల్ సిమ్ సపోర్ట్ ని కలిగి ఉంది. ఇందులో 5జీ, 4జీ కనెక్టివిటీ రెండు సిమ్స్ పై ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్‌సీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. Vivo Y52 (2022) లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.