Home News MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo Y56 5G

MediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Vivo Y56 5G

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Vivo Y56 5G
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Vivo Y56 5G
  • తాజాగా టిప్‌స్టర్ ద్వారా లీకైన Vivo Y56 5G స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రీసెంట్ గా భారత్ లో Y100 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదొక మిడ్ రేంజ్ ఫోన్, దీని ధర రూ.24,999. వినూత్నంగా ఉండే, కలర్-చేంజింగ్ డిజైన్ బ్యాక్ గల ఫోన్ కోరుకునే ఆఫ్‌లైన్ బయ్యర్స్ ని టార్గెట్ చేస్తూ వివో సంస్థ Y100 5G ఫోన్ ని తీసుకొచ్చింది. వై-సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు వివో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ లో Vivo Y56 5G డివైజ్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం.

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ ఒక బడ్జెట్ రేంజ్ 5జీ డివైజ్. కంపెనీ ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. అయితే, కొత్త లీక్ ద్వారా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, Vivo Y56 5G స్పెసిఫికేషన్స్, తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

లీకైన Vivo Y56 5G ఇండియా లాంచ్ వివరాలు

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ కంపెనీ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్. త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. లాంచ్ కి ముందు ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల చేశాడు. Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో భారత మార్కెట్ లోకి లాంచ్ కానుంది.

Vivo Y56 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ 6.5-హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండనుంది. ఈ ఫోన్ లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని షేర్ చేసిన ఇమేజ్ ప్రకారం, Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే Vivo Y56 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.