Home News Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి

Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి

Highlights
  • Vivo Y58 5G పై డిస్కౌంట్ ఆఫర్
  • రూ.1,000 ధర తగ్గింపు
  • రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్

మీరు గనుక లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, Vivo Y58 5G మంచి ఆప్షన్ కావచ్చు. ఈ డివైజ్ జూన్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.1,000 తగ్గించింది. మరోవైపు, రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో ఓవరాల్ గా Vivo Y58 5G ఫోన్ యూజర్లకు రూ.2,000 తక్కువకే లభించనుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo Y58 5G ఆఫర్ డీటెయిల్స్

Vivo Y58 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,499 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది.

రూ.1,000 తగ్గింపు మరియు రూ.1,000 క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని ఈ ఫోన్ ని రూ.17,499 కే సొంతం చేసుకోవచ్చు.

Vivo Y58 5G ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్స్ మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కంపెనీ వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Vivo Y58 5G పై ఈ ఆఫర్‌ని ఏదైనా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

మీరు ఈ ఫోన్ కొనొచ్చా?

మీరు గనుక రూ.15,000 నుంచి రూ.20,000 బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తుంటే, Vivo Y58 5G మీకు మంచి ఆప్షన్ అవ్వవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ జూన్ లోనే లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ధర కూడా రూ.17,499 (ఆఫర్స్‌తో) అంటే వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు.

Vivo Y58 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y58 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1024 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y58 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo Y58 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందించారు.

సాఫ్ట్‌వేర్: Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Vivo Y58 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ పొట్రెయిట్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, స్మార్ట్ డైనమిక్ లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి పొట్రెయిట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y58 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y58 5G డివైజ్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. దీంతో నీరు మరియు దుమ్ము నుంచి ఈ ఫోన్ కి రక్షణ లభిస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y58 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.