Home News రూ.15,000 ధరతో లాంచ్ అయిన Vivo Y73t 5G

రూ.15,000 ధరతో లాంచ్ అయిన Vivo Y73t 5G

హైలైట్స్:

Vivo కంపెనీ ఈ నెలలో వై-సిరీస్ లో చాలా ఫోన్లను లాంచ్ చేసింది. కొన్ని రోజుల క్రితం Vivo Y32t, Vivo Y52t 5G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు Vivo Y73t 5G స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y73t 5G స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Vivo Y73t 5G స్పెసిఫికేషన్స్

Vivo Y73t 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో స్క్రీన్ తయారైంది. ఇక ఈ ప్యానెల్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్ 90.6 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో కలిగి 16.7 మిలియన్ కలర్స్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y73t 5G ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో వస్తోంది. అలాగే ఇందులో ఒరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టమ్ స్కిన్ ఉంది. Vivo Y73t 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ అమర్చారు. ఇది 7-నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన, ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 2.2 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. అదే విధంగా ఈ ఫోన్ లో మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

Vivo Y73t 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo Y73t 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y73t 5G డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5జీ మరియు 4జీ కనెక్టివిటీ కలిగి ఉంది. ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని ఇచ్చారు. Vivo Y73t 5G లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Vivo Y73t 5G ధర

Vivo Y73t 5G స్మార్ట్ ఫోన్ చైనాలో మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1399 (దాదాపు రూ.15,000), 8జిబి ర్యామ్ + 256జిబి వేరియంట్ ధర CNY 1599 (రూ.17,900), 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1799 (దాదాపు రూ.20,900) గా నిర్ణయించారు. ఫాగ్ బ్లూ, ఆటమ్న్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో Vivo Y73t 5G ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.