Home News Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్

హైలైట్స్

రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ డీల్స్ నడుస్తున్నాయి. మీరు గనుక కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే Vivo Y75 5G ఉత్తమ ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ పై ప్రస్తుతం డిస్కౌంట్ లభిస్తోంది. Vivo Y75 5G లో 50 ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీని కలిగి ఉంది. దీంతో పాటు ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తోంది.

రిలయన్స్ డిజిటల్ లో Vivo Y75 5G ని కొనుగోలు చేస్తే మీకు రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్ లభించనుంది. ఆఫర్ కి సంబంధించిన వివరాలు, ఫోన్ స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.

Vivo Y75 5G డీల్స్ మరియు ఆఫర్లు

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.21,990. రిలయన్స్ డిజిటల్ అందిస్తోన్న ఆఫర్ ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.1500 క్యాష్ బ్యాక్ లభిస్తోంది. మొబిక్విక్ వాలెట్ ద్వారా డబ్బుని చెల్లిస్తే మీకు రూ.1000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా మీరు Vivo Y75 5G ని తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ని ఈఎంఐ పద్దతిలో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు కనీసం రూ.1055.8 వాయిదాతో ఫోన్ ని కొనవచ్చు.

Vivo Y75 5G స్పెసిఫికేషన్స్

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్ వాడటం జరిగింది. Vivo Y75 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. మెయిన్ కెమెరాలో నైట్ మోడల్, పొట్రెయిట్, పనోరమ, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో ఫోటోగ్రఫీ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo Y75 5G ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.