ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే ఒక కొత్త మిడ్ రేంజ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త డివైజ్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. ఇది V2278A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ మోడల్ నంబర్ Vivo Y78, Vivo Y77m అనే ఫోన్లకు సంబంధించినది. అయితే ఇప్పటికే Vivo Y78 లాంచ్ కాగా, Vivo Y77m మే నెలలో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో ఇప్పుడు గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన డివైజ్ Vivo Y77t అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.
Vivo Y77t గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Vivo Y77t డివైజ్ V2278A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఇక ఈ లిస్టింగ్ ద్వారా Vivo Y77t కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo Y77t స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y77t లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2388 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
- చిప్సెట్: Vivo Y77t స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ ఎమ్టీ6855 చిప్ ఉంటుంది. ఇది డైమెన్సిటీ 7020 చిప్ అని వివరాలను బట్టి అర్థమవుతోంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Y77t డివైజ్ లో 12జిబి ర్యామ్ ఉంటుంది. 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
- ఓఎస్: Vivo Y77t స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Vivo Y77t డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo Y77t స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
ఇప్పటి వరకు Vivo Y77t కి సంబంధించిన లాంచ్ తేదీ, ఇతర మార్కెట్స్ లభ్యత గురించి ఇంకా వివో నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన డివైజెస్ అఫీషియల్ గా లాంచ్ అవుతుంటాయి. కాబట్టి, Vivo Y77t ఫోన్ రానున్న కొన్ని వారాల్లో మార్కెట్ లోకి వస్తుందని అంచనా వేయవచ్చు.
