ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ ని మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ తో కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ని సదరు సంస్థ గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే కొన్ని మార్పులతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. మరి ఆ మార్పులు, ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y78 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.64-ఇంచ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి.
ప్రాసెసర్, ఓఎస్
- స్నాప్ డ్రాగన్ 695 చిప్
- ఆండ్రాయిడ్ 13
Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ
- 8జిబి ఇంటర్నల్ ర్యామ్
- 8జిబి వర్చువల్ ర్యామ్
- 256జిబి స్టోరేజీ
Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో ఎక్స్‌టెండబుల్ ర్యామ్ టెక్నాలజీని అందించారు. దీని ద్వారా 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని పొందవచ్చు. అంటే 8జిబి ఇంటర్నల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 16జిబి యూజర్ కి లభిస్తుంది. 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా విభాగం
- 64ఎంపి మెయిన్ కెమెరా
- 2ఎంపి సెకండరీ లెన్స్
Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వచ్చింది. ఇంకా 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్
- 5000 ఎంఏహెచ్
- 44 వాట్
Vivo Y78 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Vivo Y78 5G ధర
Vivo Y78 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ వివో సింగపూర్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. అయితే ఫోన్ ధరను గురించి ఇంకా కంపెనీ నుంచి సమాచారం బయటకు రాలేదు. ఫ్లేర్ బ్లాక్ మరియు డ్రీమీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభించనుంది. అయితే Vivo Y78 5G డివైజ్ ధర రూ.20,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ధర వివరాలను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే డివైజ్ ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి కూడా అందుబాటులోకి రానుంది.
