Home News 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78+ 5G

12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78+ 5G

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y78+ 5G డివైజ్
  • 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న స్మార్ట్ ఫోన్
  • అందుబాటులో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన స్వదేశం చైనాలో కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y78+ 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ 12జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y78+ 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం. పదండి.

Vivo Y78+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo Y78+ 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 16.7 మిలియన్ కలర్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ మరియు చిప్సెట్

Vivo Y78+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 619 జీపీయూ వాడారు.

కెమెరా విభాగం

Vivo Y78+ 5G ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్
సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Vivo Y78+ 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ మోడ్ 5జీ, 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వచ్చింది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo Y78+ 5G ధర

Vivo Y78+ 5G స్మార్ట్ ఫోన్ మొత్తం 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి + 128జిబి వేరియంట్ ధర 1599 యువాన్లు (సుమారు రూ.19,000), 8జిబి + 256జిబి వేరియంట్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.21,300) మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.23,500) గా ఉంది. భారత్ లో లాంచ్ అయితే గనుక, ఈ ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.