12GB ర్యామ్, కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో లాంచైన Vivo Y78+ (T1)

Highlights

  • చైనాలో లాంచైన Vivo Y78+ (T1)
  • Vivo Y78+ కి సక్సెసర్ గా వచ్చిన డివైజ్
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనున్న Vivo Y78+ (T1)

Vivo 2023 మొదటి త్రైమాసికంలో Vivo Y78+ 5G ఫోన్‌ను టెక్ ప్లాట్‌ఫారమ్‌లో పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM మరియు Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ శక్తితో చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. అదే సమయంలో, కంపెనీ ఈ మొబైల్ Vivo Y78+ (T1) ఎడిషన్ యొక్క కొత్త వెర్షన్‌ను కూడా చైనాలో విడుదల చేసింది.

Vivo Y78+ (T1) స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y78+ (T1) ఎడిషన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y78+ (T1) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఇకపోతే గ్రాఫిక్స్ కోసం 619 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Vivo Y78+ (T1) లో 8జిబి ర్యామ్, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Vivo Y78+ (T1) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y78+ (T1) ఎడిషన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y78+ (T1) లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ మోడల్ 5జీ ఉంది. ఇంకా 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ ఉంది. అలాగే 3.5ఎంఎం ఆడియో జాక్ అందించారు.