Home News 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y78m; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి!

50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y78m; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి!

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y78m
  • డైమెన్సిటీ 7020 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Vivo Y78m ధర 1999 యువాన్లు (సుమారు రూ.22,900)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా Vivo Y78m డివైజ్ ని లాంచ్ చేసింది. సింగిల్ మెమొరీ వేరియంట్ లో వచ్చిన ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y78m స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 1,999 యువాన్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.22,900 అని చెప్పవచ్చు. చైనాలో Vivo Y78m డివైజ్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే Vivo Y78m భారత మార్కెట్ లాంచ్ పై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

Vivo Y78m ధర

Vivo Y78m స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ డివైజ్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా పెట్టారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.22,900 అని చెప్పవచ్చు. అయితే భారత్ లో ఈ డివైజ్ ఒకవేళ లాంచ్ అయితే ధరలో మార్పు ఉండే అవకాశం ఉంది.

Vivo Y78m స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y78m స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, 2388*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y78m లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఈ చిప్ 2.2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y78m లో 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందించారు. ఇంకా 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్ కి 20జిబి ర్యామ్ వరకు లభిస్తుంది.

కెమెరా: Vivo Y78m లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y78m లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y78m లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.