Home News వచ్చే కొన్నేళ్ళలో అందుబాటులోకి రానున్న Vodafone Idea 5G సేవలు

వచ్చే కొన్నేళ్ళలో అందుబాటులోకి రానున్న Vodafone Idea 5G సేవలు

హైలైట్స్:

ఇటీవలె ఎయిర్టెల్, జియో సంస్థలు 5జీ రోలౌట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక టెలీకామ్ కంపెనీ వొడాఫోన్ ఐడియా రానున్న కొన్నేళ్ళలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అయితే ఎయిర్టెల్, జియో ల మాదిరి వీఐ టైమ్ ని పేర్కొనలేదు. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి బిజినెస్ పెర్ఫామెన్స్ ని పెంచుతామని వీఐ సీఈవో అక్షయ మూంద్రా చెప్పారు. మరోవైపు 2024 మార్చి కల్లా 5జీ రోలౌట్ ని పూర్తి చేస్తామని ఎయిర్టెల్ చెప్పగా, 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని జియో ప్రకటించింది. జియో సేవలు దీపావళి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఎయిర్టెల్ 5జీ సేవలు తొలిదశ లో 8 నగరాల్లో ప్రారంభం అవ్వబోతున్నాయి.

అక్టోబర్ 1 న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను ప్రారంభించారు. పార్ట్నర్షిప్స్, ఇకో సిస్టమ్ ప్లేయర్లతో కలిసి కన్జూమర్లు, ఎంటర్‌ప్రైజెస్ కోసం ఇండియా-స్పెసిఫిక్ యూజ్ కేసెస్ అభివృద్ధి పరిచినట్లు వీఐ సీఈవో మూంద్రా చెప్పారు.

Vi 5G రోలౌట్ ప్లాన్స్

“వొడాఫోన్ 5జీ నెట్వర్క్, సేవలు రానున్న కొన్ని ఏళ్ళలో విస్తరించాక, మా యొక్క 5జీ సొల్యూషన్స్ ఉత్తమమైన భవిష్యత్తుని అందిస్తాయి. అది కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ని మార్చి, బిజినెస్ పెర్ఫామెన్స్ ని మెరుగు పరచనుంది. దేశంలో డిజిటల్ ఎకానమీని నడిపే ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతాం,” అని సీఈవో అక్షయ మూంద్రా అన్నారు.

తాము కస్టమర్లు, కంపెనీల కోసం ఇండియా-స్పెసిఫిక్ యూజ్ కేసెస్ ని డెవలప్ చేశామని వొడాఫోన్ ఐడియా తెలిపింది. “అపరిమిత డిజిటల్ సొల్యూషన్స్ తో కనెక్ట్ అయిన ప్రపంచంలో 5జీ టెక్నాలజీతో తన వృద్ధి ప్రయాణాన్ని సాగించేందుకు వొడాఫోన్ ఐడియా సిద్ధంగా ఉంది. వివిధ డొమెయిన్స్ ద్వారా అపరిమితమైన అవకాశాలతో కూడిన సరికొత్త ప్రపంచాన్ని వీఐ 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్ తీసుకొస్తాయి. ఇది భారతదేశంలో సాంకేతిక అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుంది,” అని మూంద్రా అన్నారు.

ఇక 5జీ ఇకోసిస్టమ్ అభివృద్ధి కోసం, వొడాఫోన్ ఐడియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్మీ లతో జట్టు కట్టింది. ఇతర అగ్ర సంస్థలతో కలిసి తన యూజర్ల కి 5జీ రోలౌట్ ని అందించేందుకు వీఐ అడుగులు వేస్తోంది. ఎల్ అండ్ టీ స్మార్ట్ వరల్డ్ తో కలిసి హెల్త్ కేర్ వంటి ఇండస్ట్రీ యూజ్ కేసెస్ ని వీఐ డెవలప్ చేస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.