Home News 30 రోజుల వ్యాలిడిటీ, 30జిబి డేటాతో రూ.181 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea

30 రోజుల వ్యాలిడిటీ, 30జిబి డేటాతో రూ.181 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea

Highlights
  • రూ.181 ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Vodafone Idea
  • 30 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటాను ఆఫర్ చేస్తున్న కొత్త ప్లాన్
  • డేటా రీచార్జ్ కావున ఈ ప్లాన్ తో లభించని కాలింగ్ బెనిఫిట్

టెలీకామ్ కంపెనీ వొడాఫోన్ ఐడియా ఒక కొత్త డేటా రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. కంపెనీ తన వెబ్ సైట్ లో ఈ ప్లాన్ ధరను రూ.181 గా నిర్ణయించింది. ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల పూర్తి వ్యాలిడిటీ లభిస్తుంది. సరే, ఓసారి రూ.181 డేటా ప్లాన్ ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.

రూ.181 డేటా ప్లాన్ విశేషాలు

Vodafone Idea సంస్థ తన యూజర్ల కోసం రూ.181 ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 1జిబి డేటా, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే 30 రోజులకు గాను యూజర్స్ కి మొత్తం 30జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ డేటా ప్రధానమైనది కావున, ఈ ప్లాన్ తో యూజర్స్ కి ఉచిత కాలింగ్ సౌకర్యం లభించదు. ఈ ప్లాన్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ప్లాన్ ని బేస్ ప్లాన్ ద్వారా వాడుకోవచ్చు.

Vodafone Idea కంపెనీ గత కొన్ని రోజులుగా 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ లాంచ్ చేస్తూ వస్తోంది. రీసెంట్ గా ఈ టెలీకామ్ సంస్థ రూ.296 ప్లాన్ ని పరిచయం చేసింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్ కి మొత్తం 25జిబి సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, వీఐ మూవీస్ మరియు టీవీ క్లాసిక్ కి యాక్సెస్ లభిస్తుంది.

త్వరలో పెరగనున్న వీఐ ప్లాన్స్ ధరలు

కొన్ని నెలల క్రితం, సీఈవో అక్షయ్ మూంద్రా నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆయన స్టేట్మెంట్ ద్వారా త్వరలోనే ప్లాన్స్ ధరలు పెరగనున్నాయని హింట్ ఇచ్చారు. ట్యారిఫ్ ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ట్యారిఫ్ లెవెల్స్ తో ఏ టెలీకామ్ కంపెనీ కూడా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని రికవరీ చేసుకునే పరిస్థితి లేదని ముంద్రా అన్నారు. మొబైల్ నెట్వర్క్ సర్వీసెస్ ని వాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని ముంద్రా అన్నారు. కానీ, తక్కువ వాడకాన్ని కలిగి ఉన్న కస్టమర్ల కంటే, ఎక్కువ డేటా, కాలింగ్ ని వాడే యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ముంద్రా అన్నారు.

వొడాఫోన్ ఐడియా సంస్థ తీసుకొచ్చిన రూ.181 డేటా ప్లాన్ వివరాలు తెలుసుకున్నారు కదా. మరొకసారి ప్లాన్ సమాచారం చదివి, మీకు సరిపోయేదైతే రూ.181 ప్లాన్ రీచార్జ్ చేసుకుని, బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.