టెలీకామ్ సంస్థ వొడాఫోన్ ఐడియా తన 5జీ సేవలను లాంచ్ చేసేందుకు చాలా సమయం తీసుకుంటోంది. కానీ, కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేస్తే కస్టమర్లను ఆకట్టుకునే ప్రత్యత్నం చేస్తోంది వొడాఫోన్ ఐడియా. రీసెంట్ గా ఈ సంస్థ రూ.181 డేటా ప్లాన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం రూ.599 ప్లాన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. అపరిమిత కాలింగ్, చాలా డేటా, ఓటీటీ యాప్స్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి లభిస్తాయి.
వొడాఫోన్ ఐడియా రూ.599 ప్లాన్ ప్రయోజనాలు
- 110జిబి డేటా మరియు 200జిబి డేటా రోలోవర్
- ఉచిత ఎస్ఎంఎస్ మరియు అపరిమిత కాల్స్
ఈ ప్లాన్ కేవలం పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం వీఐ తీసుకొచ్చింది. దీంట్లో ఒక కనెక్షన్ ని ఇద్దరు వాడుకోవచ్చు. ఇందులో మొదటి వ్యక్తి ప్రైమరీ మెంబర్ గా పరిగణించబడగా, రెండో వ్యక్తి సెకండరీ మెంబర్ గా ఉంటారు. కనెక్షన్ ఎవరి పేరు మీదైతే ఉందో వారిని ప్రైమరీ మెంబర్ అని పిలుస్తారు. సెకండరీ మెంబర్ కోసం అదనపు సిమ్ ని తీసుకోవచ్చు. లేదా ఇప్పటికే యూజర్ వీఐ సిమ్ వాడుతున్నట్లయితే సదరు వ్యక్తిని సెకండరీ మెంబర్ గా యాడ్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా మొత్తం 110జిబి డేటా తో పాటు 200జిబి డేటా రోలోవర్ లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్ మరియు ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి.
ప్రైమరీ మెంబర్స్ బెనిఫిట్స్
- అపరిమిత కాల్స్
- 40+30జిబి డేటా
- 200జిబి డేటా రోలోవర్
సెకండరీ మెంబర్ బెనిఫిట్స్
- అపరిమిత కాల్స్
- 40జిబి డేటా
- 200జిబి డేటా రోలోవర్
- 3000 ఎస్ఎంఎస్/మంత్లీ
అదనపు ప్రయోజనాలు
- కేవలం ప్రైమరీ మెంబర్ మాత్రమే 6 నెలల వ్యవధి గల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ని పొందుతారు.
- రూ.499 విలువజేసే ఏడాది వ్యాలిడిటీ గల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రైమరీ మెంబర్ కి లభిస్తుంది.
- అందరు మెంబర్స్ కి వీఐ మూవీస్ అండ్ టీవీ వీఐపీ యాక్సెస్, ప్రీమియమ్ మూవీ ఫుల్ యాక్సెస్, ఒరిజినల్స్, లైవ్ టీవీ, ఎన్నో యాప్స్ కి యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
- మెంబర్స్ అందరికీ వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ ద్వారా జీ5 ప్రీమియమ్ మూవీ అండ్ షో కంటెంట్ యాక్సెస్ లభిస్తుంది.
- మెంబర్స్ అందరికీ వీఐ యాప్ లో యాడ్-ఫ్రీ హంగామా మ్యూజిక్ 6 నెలల యాక్సెస్ ఉచితం.
- Wee యాప్ పై మెంబర్స్ అందరు 1000 కి పైగా గేమ్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ప్రతీ నెల 5 గోల్డ్ గేమ్స్ ఉచితంగా లభిస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
