
5జీ సేవలు లాంచ్ చేయడంలో ఎయిర్టెల్ మరియు జియో సంస్థలతో పోల్చితే వొడాఫోన్ ఐడియా వెనుకంజలోనే ఉన్నప్పటికీ, తన ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. భారతదేశపు మూడవ అతిపెద్ద టెలీకామ్ సంస్థ అయిన వొడాఫోన్ ఐడియా తాజాగా రెండు కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.368 మరియు రూ.369 గా ఉన్నాయి. సరే, ఓసారి ఈ ప్లాన్స్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
వొడాఫోన్ ఐడియా రూ.368 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
- డెయిలీ 2జిబి డేటా
- 30 రోజుల వ్యాలిడిటీ
- డెయిలీ 100 ఎస్ఎంఎస్
- అపరిమిత కాలింగ్
- సన్‌నెక్ట్స్ యాప్ యాక్సెస్
వొడాఫోన్ ఐడియా సంస్థ తీసుకొచ్చిన రూ.368 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే యూజర్ కి మొత్తం 60జిబి డేటా లభిస్తుంది. అంతేకాదు, యూజర్ కి ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అక్కడితో అయిపోలేదండి, ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.
రూ.368 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
రూ.368 ప్లాన్ ద్వారా యూజర్ కి కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ కాకుండా కొన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటంటే, యూజర్ కి సన్ నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ లభిస్తుంది. ఇది 30 రోజుల పాటు వర్తిస్తుంది. వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ, వీఐ మూవీస్ మరియు సబ్స్క్రిప్షన్, ప్రతినెల 2జిబి డేటా బ్యాకప్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ పొందేందుకు వీఐ యాప్ యూజర్లు 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది.
Vodafone Idea రూ.369 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
- డెయిలీ 2జిబి డేటా
- 30 రోజుల వ్యాలిడిటీ
- డెయిలీ 100 ఎస్ఎంఎస్
- ఉచిత కాలింగ్
- సోనిలివ్ యాప్ యాక్సెస్
రూ.369 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే కస్టమర్ కి మొత్తం 60జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం యూజర్ కి లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ యూజర్ కి 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.
రూ.369 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
రూ.369 ప్లాన్ ద్వారా యూజర్ కి కొన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటంటే, యూజర్ కి బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, సోనిలివ్ యాప్ యాక్సెస్, వీఐ మూవీస్ మరియు టీవీ యాప్స్, ప్రతినెల 2జిబి వరకు డేటా బ్యాకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ అదనపు ప్రయోజనాలు పొందేందుకు యూజర్ 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ విషయం ఏంటంటే, రూ.368 మరియు రూ.369 ప్లాన్స్ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. అయితే, రూ.368 ప్లాన్ సన్ నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ కలిగి ఉంటే, రూ.369 ప్లాన్ ద్వారా సోనిలివ్ యాప్ కి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











