Vodafone Idea (Vi) సంస్థ తాజాగా తన భారత కస్టమర్ల కోసం ఒక కొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ తన చీపెస్ట్ ప్లాన్ అయిన రూ.99 ని ఎన్నో సర్కిల్స్ లో నిలిపివేసిన క్రమంలో వొడాఫోన్ ఐడియా నుంచి తాజా ప్లాన్ ప్రకటన వచ్చింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, బీహార్, నార్త్ ఈస్ట్ సర్కిల్స్, హర్యాణ, ఒడిషా సర్కిల్స్ లో ఎయిర్టెల్ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ ధర రూ.155 గా ఉంది.
తన తాజా ప్రకటనతో వొడాఫోన్ ఐడియా రూ.100 లోపు మినిమమ్ రీచార్జ్ ప్లాన్ ని ఆఫర్ చేస్తున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు జియో మినిమమ్ రీచార్జ్ ప్లాన్ రూ.129 గా ఉంది. సరే, ఓసారి వొడాఫోన్ ఐడియా రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
Vodafone Idea రూ.99 ప్లాన్ బెనిఫిట్స్
వొడాఫోన్ ఐడియా కొత్త మినిమమ్ రీచార్జ్ ప్లాన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ కంపెనీ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ ధర రూ.99 గా ఉంది. ఈ ప్లాన్ తో రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. అలాగే 200ఎంబి ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో యూజర్లకు ఎస్ఎంఎస్ లు లభించవు. ఒకవేళ మెసేజ్ పంపితే, తమ మెయిన్ బ్యాలన్స్ నుంచి చార్జ్ చేయబడుతుంది.
Vi యాప్ ద్వారా 5జిబి డేటా
Vodafone Idea మరొక కొత్త ఆఫర్ ని కూడా తీసుకొచ్చింది. భారత్ లోని తన ప్రీపెయిడ్ యూజర్లకు ఈ ఆఫర్ తో 5జిబి అదనపు డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వీఐ యాప్ ద్వారా ఫిబ్రవరి 7 లోపు రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. రూ.299 కి పైన వీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లు 5జిబి డేటా పొందుతారు. ఇక రూ.199 కంటే పైస్థాయి ప్లాన్స్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 2జిబి డేటా లభిస్తుంది. ఆఫర్ ద్వారా అదనంగా లభించే డేటా 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటుంది.
ఇంకా జాడలేని Vodafone Idea 5G
ఎయిర్టెల్, జియో లాంటి టెలీకామ్ సంస్థలు భారతదేశ వ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించడంతో పాటు, విస్తరణ పనుల్లో బిజీగా ఉండగా, వొడాఫోన్ ఐడియా 5జీ ఇంకా జాడలేదు. వీఐ సీఈవో అక్షయ్ ముంద్రా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కంపెనీ రానున్న కొన్నేళ్ళలో 5జీ నెట్వర్క్ ని తీసుకొస్తామని అన్నారు. దీన్ని బట్టి, కచ్చితమైన టైమ్ లైన్ ఏదీ ఇంకా ఖరారు కాలేదని స్పష్టమవుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
