Home News రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea

రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea

Highlights
  • రూ.289, రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తీసుకొచ్చిన Vodafone-idea
  • రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న అపరిమిత కాలింగ్, ఇంటర్నెట్ డేటా
  • రెండు రీచార్జ్ ప్లాన్స్ ద్వారా లభించనున్న 78 రోజుల వ్యాలిడిటీ, 1,000 ఎస్ఎంఎస్

Vodafone-idea సంస్థ తన యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటు ధరలో లభించనున్నాయి. ఈ ప్లాన్స్ ధరలు రూ.289 మరియు రూ.429 గా ఉన్నాయి. వీఐ స్టోర్స్ ద్వారా ఈ రీచార్జ్ లను చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు ప్లాన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.

రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న ఉచిత కాలింగ్ మరియు 6జిబి వరకు డేటా ప్రయోజనం

Vodafone-idea సంస్థ లాంచ్ చేసిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే, ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్ కి అపరిమిత వాయిస్ కాలింగ్, 6జిబి వరకు డేటా, 1000 వరకు ఎస్ఎంఎస్ మరియు 78 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి. ఈ ప్లాన్స్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందా పదండి.

Vodafone-idea రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

Vodafone-idea తీసుకొచ్చిన రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇతర బెనిఫిట్స్ చూస్తే, ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 48 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటా అలాగే మొత్తం 600 ఎస్ఎంఎస్ లభిస్తాయి. డేటా వినియోగంపై రోజువారీ పరిమితులు లేవు. అంటే, మీకు నచ్చినంత డేటాను వాడుకోవచ్చన్నమాట.

Vodafone-idea రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

Vodafone-idea సంస్థ తీసుకొచ్చిన రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్స్ కి అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో పాటు, 6జిబి డేటా, 1000 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 78 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో కూడా రోజువారీ డేటా వినియోగ పరిమితి లేదు. దీనర్థం మీకు కావాల్సినంత డేటాను వాడుకునే వెసులుబాటు ఉంటుంది.

Vodafone-idea సంస్థ కొత్తగా తీసుకొచ్చిన రూ.429 మరియు రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా? మరొక్కసారి ఈ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను చదివి తెలుసుకుని, మీకు సరిపడేవైతే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఆనందించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.