హైలైట్స్:
- బుకింగ్ విండో తెరిచాక కేవలం 2 గంటల్లోనే అమ్ముడైన వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్
- ఇప్పటికే బుక్ అయిన 150 యూనిట్స్ తో కూడిన తొలి బ్యాచ్, అక్టోబర్ 2022 నుంచి మొదలుకానున్న డెలివరీ
- తదుపరి బ్యాచెస్ కి కూడా బుకింగ్స్ తీసుకోనున్న వోల్వో
వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ వాహనం మొదటి బ్యాచ్ 150 యూనిట్లు రెండు గంటల్లోనే అమ్ముడైనట్లు స్వీడన్ కు చెందిన కార్ తయారీదారు వోల్వో ప్రకటించింది. ఎప్పుడో గతేడాది వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ ప్రివ్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత నిన్న ఉదయం 11 గంటలకు సేల్ కి వచ్చి, వెంటనే అమ్ముడైపోయింది. ఒక లగ్జరీ ఈవీ కారు కి ఇది రికార్డు బ్రేకింగ్ ఫీట్ అని కంపెనీ చెబుతోంది.
నిన్న లాంచ్ అయిన వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ ఒక లగ్జరీ ఎస్‌యూవీ, కాగా ఇది భారత్ లో మినీ కూపర్ ఎస్ఈ, కియా ఈవీ6, బీఎండబ్ల్యూ ఐ4 కార్లకు పోటీ ఇవ్వనుంది. భారత్ లోనే అసెంబుల్ చేయాలని వోల్వో అనుకోవడంతో, కారు ధర కూడా కాస్త తక్కువగానే పెట్టారు.
భారత్ లో Volvo’s XC40 Recharge ధర
అత్యంత త్వరగా అమ్ముడైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ అని వోల్వో కంపెనీ చెబుతోంది. జులై 27న ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే, కేవలం రెండు గంటల్లో వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ 150 యూనిట్లు అమ్ముడయ్యాయి.
భారత్ లో వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ కారు ధర రూ.55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఎడబ్ల్యూడీ తో కూడిన ట్విన్ మోటర్ సెటప్ ని ఈ కారు కలిగి ఉంది. వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ 78kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంది. ఇది 150kW ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సింగిల్ రీచార్జ్ తో ఈ కారు 418 కిలోమీటర్లు పరుగెడుతుంది.
అక్టోబర్ 2022 నుంచి డెలివరీ మొదలు పెట్టాలని వోల్వో ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 2022 కల్లా మొదట బుక్ అయిన 150 యూనిట్ల డెలివరీ పూర్తి కానుంది. వోల్వో ఇంకా బుకింగ్స్ తీసుకోవాలని నిర్ణయించింది. రానున్న బ్యాచ్ వెహికిల్స్ ని బుక్ చేసుకున్న కస్టమర్లకు అందజేస్తారు.
దీనిపై మాట్లాడిన వోల్వో ఎండీ, జ్యోతీ మల్హోత్రా “తమ వ్యాపార భాగస్వాముల యొక్క లొకేషన్స్ లో కారుని షోకేస్ చేయడం, ఈ నగరాల్లో ఉన్న కస్టమర్లకు వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ కారును నడిపే అవకాశం ఇవ్వడం వంటి స్ట్రేటజికల్ మూవ్స్ వినియోగదారులు సరైన ఎంపిక చేసుకునేలా తోడ్పడ్డాయి,” అని అన్నారు.
వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ కారులో 500 కిలోల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇక ఈ కారు గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. 4.9 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక భద్రత ప్రమాణాలు గురించి తెలుసుకుందాం. భద్రతకై ఈ కారులో 6 ఎయిరు బ్యాగ్స్ తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ను అందించారు. హార్మన్ కార్డన్ ప్రీమియమ్ సౌండ్ సిస్టమ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, కొలీషన్ మిటిగేషన్ సపోర్ట్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. కాగా, ఈ కారు బుకింగ్ ధర రూ.50,000.