Samsung: త్వరలో లాంచ్ కాబోయే Galaxy A55 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం!

Highlights

  • మార్చి 11న లాంచ్ కానున్న Galaxy A55 5G
  • ఎగ్జినోస్ 1480 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Galaxy A55 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్ సంస్థ పరీక్షిస్తోంది. ఇప్పటివరకు శాంసంగ్ గెలాక్సీ ఏ55 యొక్క వివరాలు రహస్యంగానే ఉన్నాయి. కానీ, తాజాగా ఇండియా లాంచ్‌కి ముందు, గెలాక్సీ ఏ55 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ బెల్జియన్ షాపింట్ సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలతో పాటు టాప్ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G టాప్ స్పెసిఫికేషన్స్

త్వరలో లాంచ్ కాబోయే Samsung Galaxy A55 5G ఫోన్ కోసం ఏ-సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది.

Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.

Samsung Galaxy A55 5G లో 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటాయి.

Samsung Galaxy A55 5G 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ ఒకటి కంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి మోడల్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Samsung Galaxy A55 5G లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాక్ కెమెరా: Samsung Galaxy A55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
Previous articleSamsung: 50MP కెమెరా, FHD డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy M14 4G
Next articlePOCO X6 Neo ఇండియా లాంచ్ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.