Home News Samsung: త్వరలో లాంచ్ కాబోయే Galaxy A55 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం!

Samsung: త్వరలో లాంచ్ కాబోయే Galaxy A55 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం!

Highlights
  • మార్చి 11న లాంచ్ కానున్న Galaxy A55 5G
  • ఎగ్జినోస్ 1480 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Galaxy A55 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్ సంస్థ పరీక్షిస్తోంది. ఇప్పటివరకు శాంసంగ్ గెలాక్సీ ఏ55 యొక్క వివరాలు రహస్యంగానే ఉన్నాయి. కానీ, తాజాగా ఇండియా లాంచ్‌కి ముందు, గెలాక్సీ ఏ55 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ బెల్జియన్ షాపింట్ సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలతో పాటు టాప్ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G టాప్ స్పెసిఫికేషన్స్

త్వరలో లాంచ్ కాబోయే Samsung Galaxy A55 5G ఫోన్ కోసం ఏ-సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది.

Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.

Samsung Galaxy A55 5G లో 32ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటాయి.

Samsung Galaxy A55 5G 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (లీక్)